తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన - అన్నదాతతో మమేకమైన చిన్నారులు - ఈటీవీ భారత్‌తో రైతు దినోత్సవ ప్రత్యేక కథనం

Farmers Day Special Story with ETV Bharat : దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడిన రంగం వ్యవసాయం. ప్రకృతి సహకరించకపోవడం, విపత్తుల వల్ల వరుస నష్టాలు, అప్పుల బాధతో సాగు కష్టతరంగా మారింది. రోజు రోజుకు నాగలి పట్టి సాగు చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇది ఇలానే కొనసాగితే దేశంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన పెంచడం కోసం ఈటీవీ, ఈటీవీ భారత్ నడుం బిగించింది.

Agricultural Awareness Program for Students
Farmers Day Special Story with ETV Bharat

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 5:38 PM IST

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన - అన్నదాతతో మమేకమైన చిన్నారులు

Farmers Day Special Story with ETV Bharat :భారత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తోంది. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం తిరోగమనం చెందుతోంది. నలుగురికీ అన్నం పెట్టే అన్నదాతకు ఓవైపు వరుస విపత్తులతో పంట నష్టం, మరోవైపు అప్పుల బాధలతో సాగును మానేసే దుర్బల పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణాలకు వలస వెళ్లి కూలీ పనులు(Labor works) చేసుకుంటున్నారు. రోజు రోజుకు వంట పండించే వారి సంఖ్య తగ్గిపోతుంది. తినే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇది ఇలానే కొనసాగితే దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది.

Agricultural Awareness Program for Students :ఇది దేశానికి ఎంతో ప్రమాదం. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు యువత వ్యవసాయ రంగంలోకి రావాలి. అంతే కాదు, కలుషితం లేని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. విద్యార్థి దశలోనే సాగు ప్రాముఖ్యతను వివరించేందుకు నేడు జాతీయ రైతు దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులచే వ్యవసాయ క్షేత్ర పర్యటన(Farm Tour) నిర్వహించారు.

National Farmers Day 2023 : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లికి చెందిన రైతు పొల్లేటి జైపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. శ్రీ వివేకవర్ధిని ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని సాగులోని ఆధునిక పద్ధతులు, సేంద్రియ సాగుపై లాభ, నష్టాలు అడిగి తెలుసుకున్నారు.

'సంతోషాల పంట పండిద్దాం'- పొలంలో యువరైతు ప్రీ వెడ్డింగ్ షూట్​

వ్యవసాయ క్షేత్రంలోని గోశాలలో వరి నారు మల్లు, వేరుశనగ, మొక్కజొన్న మామిడి తోటలను ప్రత్యక్షంగా చూపిస్తూ ఒక్కో అంశాన్ని విద్యార్థులకు వివరించారు. జీవామృతాన్ని స్వయంగా విద్యార్థులతో తయారు చేయించారు. సేంద్రియ సాగులో(Organic Farming) ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ఇక్కడ మేము పరిశీలించిందేమిటంటే, ముఖ్యంగా ఇక్కడ రైతు మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. పలు రకాల పంటలను ఇలా కలిపి ఒక దగ్గరే పండిస్తున్నారు. దీనివల్ల రైతుకు ఒక దగ్గర పంట నష్టం వచ్చినా, మరోక దానిలో లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి. సేంద్రియ వ్యవసాయం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మేము తెలుసుకున్నాం. సేంద్రియ పంటసాగు కోసం సవివరంగా జైపాల్ రెడ్డి రైతు వివరించారు.-విద్యార్థినులు

Kisan Diwas 2023 : విద్యార్థులు ఈ పర్యటనలో అనేక కొత్త విషయాలను సవివరంగా నేర్చుకున్నారు. కొంత మంది విద్యార్థుల సందేహాలను, రైతు జైపాల్ రెడ్డి నివృత్తి చేశారు. సేంద్రియ సాగు వల్ల ఒనగూరే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఆహారం కలుషితమై ప్రజలు వ్యాధుల బారినపడుతున్నట్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని వివరించారు.

సేంద్రియ సాగుతో ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందని, ప్రతి రైతు సేంద్రియ సాగు పైపు మళ్లేలా విద్యార్థులు కృషి చేయాలని వివరించారు. సేంద్రియ సాగుతో ఒక వైపు నేల గుల్ల భారడమే కాక పంటలతో మనుషులు ఆరోగ్యకరమైన జీవనం(Healthy Living) సాధ్యమవుతుంది. ప్రతిఒక్కరూ ఈ రంగం వైపు మళ్లేలా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

నేను సేంద్రియ వ్యవసాయం మాత్రమే చేస్తాను. ఈ సాగు ఉపయోగం, చేసే విధానం కోసం ఇవాళ విద్యార్థులకు చెప్పాను. ముఖ్యంగా చెప్పాలంటే విద్యావ్యవస్థలో కూడా తప్పకుండా వ్యవసాయమనేది ఒక సబ్జెక్టుగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే వ్యవసాయంలో ఏ పిల్లలు కూడా రావటం లేదు. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం పండించకుంటే ఆకలి కేకలు మొదలవుతాయి. కాబట్టే ముందే వ్యవసాయంపై అవగాహన కల్పించటం మంచిది.-జైపాల్ రెడ్డి, సేంద్రియ సాగుదారు

ఉద్యోగ వేట నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వరకు- ఈ యువరైతు ప్రస్థానం సాగిందిలా

ఆధునిక పద్ధతుల్లో సాగు- ఏడాదికి కోట్లలో ఆదాయం- ఈయన 'బిలియనీర్ రైతు'!

ABOUT THE AUTHOR

...view details