మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రబీలో వరి పంట సాగు పద్ధతులు, ఎరువుల సరైన వినియోగంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్ రైతులకు వివరించారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. పంట మార్పిడి పాటించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలను వినియోగించుకోవాలని కోరారు.
ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు - mahabubabad district news today
రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఏవో కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :రాజన్నపై నిర్లక్షమేల... ఏఈఓకు నోటీసులు, ఇద్దరిపై వేటు