మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి, రేపోని గ్రామాలకు చెందిన పలువురు రైతులు బీపీటీ రకానికి చెందిన వరి విత్తనాలు 30 కిలోల బస్తా రూ.775 చొప్పున కొనుగోలు చేసి ఇటీవల నాటు వేశారు. రోజులు గడిచినా నారు పెరగకపోవటంతో పాటు వచ్చిన కొద్ది పాటి నారు కుళ్లిపోయిందని రైతులు ఆరోపించారు.
నకిలీ విత్తనాలు ఇచ్చారంటూ రైతుల ఆందోళన - Farmers are concerned about Shopkeepers giving fake seeds
మహబూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించడం వల్ల వరినారు పెరగడం లేదని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాధిత రైతులు స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట ఆందోళన చేశారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నకిలీ విత్తనాలు ఇచ్చారంటూ రైతుల ఆందోళన
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దుకాణం వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.