అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. ట్రంప్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ట్రంప్ పర్యటనను నిరసిస్తూ మహబూబాబాద్‌లో ఆందోళన - ట్రంప్ గోబ్యాక్
రైతు సంఘాల పిలుపు మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వ్యతిరేకంగా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ట్రంప్ పర్యటనను నిరసిస్తూ మహబూబాబాద్‌లో ఆందోళన
అమెరికాకు చెందిన పాడి,పౌల్ట్రీ ఉత్పత్తులను ఇండియాలో దిగుమతి చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఇండియాకు వచ్చినట్లు న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య ఆరోపించారు. లెగ్‌పీస్‌లపై దిగుమతి సుంకాలను 100శాతం నుంచి 25శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ఇప్పటికే నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ కుదేలై పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: '300 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం