అకాల వర్షాలకు పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం వల్ల మనస్థాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గుడి తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బోడ దంజీ(35) 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. అధిక వర్షాలతో పంటకు తెగులు సోకి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన తండావాసులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, తండా వాసుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య - Rythu_Athmahathya
పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం వల్ల మనస్తాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గుడి తండాలో చోటుచేసుకుంది.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య