తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాత ఉపాయం .. పంట రక్షణకు పులి బొమ్మాస్త్రం - వరంగల్ తాజా వార్తలు

crops protect with tiger: పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ప్రకృతి నష్టం కలిగిస్తే మరోపైపు వానరాల నుంచి సైతం ముప్పు తప్పడం లేదు. ఇలాంటి బాధ నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు అందరికంటే కాస్త విభిన్నంగా ఆలోచించారు. కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు పులి బొమ్మను అస్త్రంగా ప్రయోగించి పంటను రక్షించుకుంటున్నారు.

crops  protect with tiger
పులి బొమ్మతో పంటకు రక్షణ

By

Published : Apr 11, 2022, 11:57 AM IST

crops protect with tiger: కోతుల బెడదతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు అన్నీఇన్నీ కావు. చేతికొచ్చిన పంట వన్యప్రాణుల పరం కాకుండా మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. పులి బొమ్మతో వాటి బారి నుంచి పంటకు రక్షణ కల్పించుకుంటున్నారు.

పంట రక్షణకు పులి బొమ్మాస్త్రం

రూ.3వేలు ఖర్చు: మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలంలో కోతుల బెడద అధికంగా ఉంది. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ముందుకు సాగుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండల కేంద్రానికి చెందిన కొమ్ము శ్రీరాములు అనే రైతు వినూత్నంగా ఆలోచన చేసి వరి పంటను కాపాడుకుంటున్నారు. శ్రీరాములు రూ.3 వేలు పెట్టి ఓ పులి బొమ్మను కొనుగోలు చేసి.. ప్రతిరోజూ ఉదయం తన పొలం వద్దకు వెళ్లేటప్పడు ఆ బొమ్మను తీసుకెళ్లి పొలం మధ్యలోని ఎత్తైన బండరాయిపై పెడుతున్నారు.

కనిపించే పులి బొమ్మను చూసి వానరాలు నిజమైన పులిగా భావించి అటు వైపు రాకుండా పలాయనం చిత్తగిస్తున్నట్లు రైతు తెలిపారు. పులి బొమ్మతో కోతుల బాధ తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాములును ఆలోచనను వారు మెచ్చుకుంటున్నారు. తమ పొలాల్లోనూ ఇలాంటి బొమ్మను కొనుగోలు చేసేందుకు గ్రామంలోని ఇతర రైతులు కూడా ఉత్సాహం చూపుతున్నారు.

ఇదీ చదవండి: Pet Lover : మూగజీవాలంటే ఆమెకు ప్రాణం.. అందుకే

ABOUT THE AUTHOR

...view details