హలం పట్టే రైతన్నలు వలలు పట్టారు. పొలంలో దిగాల్సిన కర్షకులు కుంటలో దిగారు. వ్యవసాయానికి సెలవు పెట్టి మరీ వేట కొనసాగించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరాతండాలోని గిరిజనులు ఆదివారం రోజు... చేపల వేట సాగించారు. ఒక్కరో ఇద్దరో కాందడోయ్... వందల సంఖ్యలో...!
పొలానికి సెలవు పెట్టారు... కుంటలో చేపలు పట్టారు
సెలవే లేని శ్రామికులు రైతులు. అలాంటి హాలికులు సెలవు తీసుకున్నారని ఎప్పుడైనా విన్నారా...? ఊరు ఊరంతా కలిసి ఒకే కుంటలో దిగటం ఎప్పుడైనా చూశారా...? అందరూ వలలు పట్టి చేపలను వేటాడటం వీక్షించారా...? అయితే ఇప్పుడు చూడండి.
fakeera tanda farmers combainly went for fishing
సూర్యోదయానికి ముందు పొలం బాట పట్టి... సూర్యాస్తమయం అయ్యాక కానీ... ఇంటికి వెళ్లని ఆ గిరిజనులు... ఈ ఆదివారం మాత్రం వ్యవసాయానికి సెలవు పెట్టారు. అందరూ వలలు పట్టుకుని తండాలోని బంజార కుంటకు వెళ్లి చేపలు పట్టారు. ఒక్కొక్కరు తక్కువలో తక్కువ నాలుగైదు కిలోల చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు చేపల వేట జాతరలా కన్పించాయి.