తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం - అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం

ఆంధ్రప్రదేశ్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న అక్రమ నల్లబెల్లం, పటికను మహబూబాబాద్​ జిల్లా ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

illigal transportation
నల్లబెల్లం స్వాధీనం

By

Published : Nov 27, 2019, 11:29 PM IST

ఏపీలోని చిత్తూరు నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల నల్లబెల్లం, టన్ను పటికను మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్సైజ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు సీఐ రమేశ్​చందర్ వెల్లడించారు. లారీకి ఎస్కార్ట్​గా ఉన్న స్విఫ్ట్ కారును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ శివారులోని ఏటిగడ్డ తండాకు చెందిన సుమన్ బెల్లం రవాణాకు ప్రధాన సూత్రధారి అని ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

నల్లబెల్లం స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details