తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - మక్కల కొనుగోలు

మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ ఛైర్మన్ గంగారెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లు పాల్గొన్నారు.

Establishment of Makkal Purchase Centers in mahabubabad
మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

By

Published : Apr 9, 2020, 6:25 AM IST

మహబూబాబాద్ జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మార్క్​ఫెడ్ ఛైర్మన్ గంగారెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్​ ప్రారంభించారు. కేసముద్రం మండలం వెంకటగిరి, మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామాల్లో కొనుగోలు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలను రూ. 1760 మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు అధైర్య పడవద్దని.. టోకెన్ల వారీగా కొనుగోలు కేంద్రాలకు సరకులు తీసుకుని రావాలని ఎమ్మెల్యే సూచించారు.

మక్కలు బాగా ఎండబెట్టి తేమ లేకుండా చూసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం నీటితో రబీలో ధాన్యం మంచి దిగుబడి వస్తుందన్నారు. వాటిని కూడా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్క్​ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు

ABOUT THE AUTHOR

...view details