మహిళలపై జరిగే లైంగిక దాడుల కేసులు సత్వరం పరిష్కారం అయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జయకుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసే ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన పిమ్మట, కోర్టు ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం కోర్టులోని పలు విభాగాలను, నూతనంగా నిర్మించే ఫాస్ట్ ట్రాక్ కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బార్ అసోసియేషన్ భవన్లో లాయర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.