తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో నిత్యావసరాల పంపిణీ - undefined

లాక్​డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న వలస కార్మికులకు మహబూబాబాద్​లో స్వచ్ఛంద సంస్థల తరఫున నిత్యావసరాల పంపిణీ జరిగింది. వాసవీ నటరాజ వీరభద్రస్వామి కోలాట బృందం సభ్యులు రేషన్ కార్డులేని వలస కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేశారు.

Essentials distribution in Mahabooba bad
మహబూబాబాద్​లో నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 15, 2020, 2:56 PM IST

మహబూబాబాద్​లోని వాసవీ నటరాజ వీరభద్రస్వామి కోలాట బృందం సభ్యులు రేషన్ కార్డులేని వలస కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక వై.ఎస్.ఆర్ కాలనీలో సుమారు వందమంది వలస కూలీలు, నిరుపేద కుటుంబాలకు, బియ్యం, కిరాణా సామాన్లు, కూరగాయలను పంపిణీ చేశారు. ఇటువంటి విపత్తు సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తమకు చేతనైన సహాయాన్ని బృంద సభ్యులంతా కలిసి చేస్తున్నామని కోలాట బృందం సభ్యురాలు బవిరిశెట్టి రాధిక తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించి ఇంట్లోనే ఉండాలని, కరోనా కట్టడికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ab

ABOUT THE AUTHOR

...view details