మహబూబాబాద్ జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, తెరాస నేత కేఎస్ఎన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 200 మంది పేపర్ బాయ్స్ , నిరుపేదలకు, బియ్యం, నిత్యావసర వస్తువులు కూరగాయలను ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కేఎస్ఎస్ పుట్టిన రోజు సందర్భంగా వృథా ఖర్చులు చేయకుండా, నిరుపేద పిల్లలను ఆదుకున్నందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయన్ను అభినందించారు.
పుట్టిన రోజు నాడు నిరుపేదలకు సరకుల కానుక... - 200 మంది పేపర్ బాయ్స్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేఎస్ఎస్ రెడ్డి జన్మదినం సందర్భంగా కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమ చేతుల మీదుగా సరకులు అందించారు.
మహబూబాబాద్‌లో కిరాణా సామగ్రి పంపిణీ