మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు వివిధ పార్టీల నేతలు. చిన్న చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలను తెరాస జడ్పీటీసీ అభ్యర్థి నూకల వెంకటేశ్వర్‌రెడ్డి కలిశారు. తనను గెలిపిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన జడ్పీటీసీ అభ్యర్థి మార్క కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రాదేశిక ఎన్నికలకు జోరుగా నేతల ప్రచారం - undefined
త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![ప్రాదేశిక ఎన్నికలకు జోరుగా నేతల ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3141454-thumbnail-3x2-vysh.jpg)
జోరుగా నేతల ప్రచారం
TAGGED:
ENNIKALA_PRACHARAM