గుండాల అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీసులు, మావోలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు మరణించాడు. ఈ చర్యకు ప్రతీకారంగా మావోలు విధ్వంసానికి దిగే అవకాశం ఉండటం వల్ల మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎన్కౌంటర్ ఎఫెక్ట్: పోలీసుల విస్తృత తనిఖీలు - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
ఇటీవల గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎన్కౌంటర్ ఎఫెక్ట్: జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
ఏజెన్సీ మండలాలైన గంగారం, కొత్తగూడ, బయ్యారం మండలాల్లో ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు. వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను క్షుణ్నంగా అడిగి తెలుసుకుంటున్నారు.
ఇదీచూడండి..హలో..కేసీఆర్ను మాట్లాడుతున్నా.. పంచాయతీ కార్యదర్శికి సీఎం ఫోన్