తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే బ్యాలెట్​ పేపర్​... 9 గుర్తులపై ఓటేయాలి.. - మత్స్య శాఖ సహకార సంఘం ఎన్నికలు

ఒక బ్యాలెట్​ పేపర్​లో ఒకే ఓటు వేస్తాం. కానీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో 9 ఓట్లు వేయాల్సిన పరిస్థితి మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలోని ఉప్పరిపల్లిలో చోటు చేసుకుంది.

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం

By

Published : Jul 13, 2019, 12:59 PM IST

మహబూబాబాద్​లో మత్స్యశాఖ సహకార ఎన్నికలు

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరుగుతున్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక సభ్యుడు బ్యాలెట్​ పేపర్​పై ఒక ఓటు కాకుండా 9 ఓట్లు వేయాల్సి వచ్చింది.

గ్రామంలో 152 మంది మత్స్యకారులకు ఓట్లున్నాయి. వీరు 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. సంఘంలో సభ్యులు రెండు ప్యానల్స్​గా విడిపోవడం వల్ల ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఒక్కో ప్యానల్ నుంచి 9 మంది అభ్యర్థుల చొప్పున మొత్తం 18 మంది అభ్యర్థులు డైరెక్టర్లుగా బరిలో నిలుచారు. అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు చొప్పున 18 గుర్తులతో బ్యాలెట్ పేపర్​ను ముద్రించారు. సంఘంలోని ప్రతి సభ్యుడు 9 మంది డైరెక్టర్లకు ఓట్లు వేయాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ జరుగుతుందని... అనంతరం 1:30 నిమిషాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రిటర్నింగ్​ అధికారి రాజశేఖర్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : ఇద్దరు చిన్నారులను మింగేసిన నీటి కుంట

ABOUT THE AUTHOR

...view details