తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలు స్వాధీనం...  నలుగురి అరెస్టు - duplicate seeds selling in mahabbobabad

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుపరుస్తున్న నియంత్రిత సాగు విధానాన్ని అదునుగా చేసుకుని కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. ఏజెన్సీ, మారు మూల ప్రాంతాల్లోని అమాయక రైతులను మోస్తం చేస్తూ... లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మహబూబాబాద్​లో నకిలీ విత్తనాల దందా నడుపుతున్న ముఠాను అరెస్టు చేశారు.

duplicate seeds selling group arrested in mahaboobabad
నకిలీ విత్తనాల దందా చేస్తోన్న ముఠా గుట్టు రట్టు

By

Published : Jun 25, 2020, 6:05 PM IST

మహబూబాబాద్​లో నకిలీ విత్తనాలు తయారుచేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని గుమ్మనూరులో దందా నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు, అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రూ.50 లక్షల విలువ చేసే ప్యాక్ చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తన ప్యాకెట్లు... ప్యాక్ చేయకుండా నిల్వచేసిన 33 బస్తాల విడి పత్తి గింజలను సీజ్ చేశారు.

బయ్యారంలో ఫర్టిలైజర్ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఓ వ్యాపారి, మేడ్చల్​కు చెందిన మరో వ్యక్తి కలిసి ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీ ఎత్తున నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విడి గింజలను తీసుకొచ్చారు. గింజలకు రంగులు వేసి... పలు కంపెనీలకు చెందిన కవర్లలో ప్యాక్ చేశారు. గ్రామాల వారీగా ఏజెంట్లను నియమించుకుని ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ABOUT THE AUTHOR

...view details