మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల దుకాణాల యజమానులు రైతులను మోసం చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని గడువు ముగిసిన పురుగు మందులను అంటగడుతున్నారు. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు.. ఫెస్టిసైడ్ దుకాణాల యజమానుల ఆగడాలతో దిక్కు తోచని స్థితిలో పడుతున్నారు.
రైతులకు గడువు ముగిసిన పురుగు మందుల విక్రయం - duplicate pesticides
గడువు ముగిసిన పురుగుల మందులు ఇచ్చి ఎరువుల దుకాణాల యజమానులు మహబూబాబాద్ జిల్లాలో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన రైతు తన మిర్చి తోట కోసం.. మండలంలోని రాజోలులో సందీప్ ఫెర్టిలైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేశాడు. అవి గడువు ముగిసిన మందులు అని గమనించి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలే జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయగా.. దుకాణాన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు. అయినా వ్యాపారులు తీరు మార్చుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: శాసనసభ నిబంధనల కమిటీల ఛైర్మన్లు వీరే...