మహబూబాబాద్ జిల్లాలో 2021 సంవత్సరానికి ప్రజలు ఎవరి ఇళ్లల్లో వారే స్వాగతం పలికారు. ప్రధాన రహదారులపై కొందరు అక్కడక్కడా బాణాసంచా కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. జిల్లా వ్యాప్తంగా 30 బృందాలతో గురువారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. కొవిడ్ దృష్ట్యా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
యువకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తోన్న ఎస్పీ కోటిరెడ్డి ప్రజలు సహకరించాలి
జిల్లా కేంద్రంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి.. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. 2020 సంవత్సరం కరోనాతో గడిచిపోయిందని.. 2021లో అయినా కరోనా అంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గతేడాదిలో ప్రజలు ఏవిధంగా సహకరించారో నూతన సంవత్సరంలోనూ అదేవిధంగా సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ