మహబూబాబాద్ జిల్లాలో రెండు పడకగదుల(double bedroom houses) తాళాలు పగలగొట్టి లబ్ధిదారులు ప్రవేశించారు. ఇళ్ల పంపిణీ ఆలస్యం కావడంతో ఇళ్లలోకి చేరారు. కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణం పూర్తయినా.. పంపిణీ చేయడం లేదని వారు ఆరోపించారు. వర్షాలతో(rains in telangana) గుడిసెల్లో ఇబ్బంది పడలేక ఇళ్ల ముందు పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి లోపలికి ప్రవేశించామని తెలిపారు.
2018లో రూ.2 కోట్లతో 38 ఇళ్లను నిర్మించారు. ఏడాది క్రితం పనులు పూర్తయ్యాయి. లబ్ధిదారులను(double bedroom beneficiaries) ప్రాథమికంగా గుర్తించినా వారికి అప్పగించలేదు. వాటిని ప్రారంభించలేదు. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నానా అవస్థలు పడుతున్నామని 13 కుటుంబాలు కొత్త ఇళ్లలోకి ప్రవేశించారు. పలువురు వంటలు కూడా చేసుకున్నారు.