మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో షాదీముబాకర్, కల్యాణలక్ష్మి చెక్కులనుఎమ్మెల్యే రెడ్యానాయక్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 134 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అనంతరం డోర్నకల్ పట్టణానికి చెందిన బాదర్ పాషా సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని... ముస్లీంలకు దుస్తులు, సేమియాలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
డోర్నకల్‌లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ
పేదింటి ఆడపడుచులకు కేసీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా నిలుస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వెల్లడించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందించారు.
డోర్నకల్‌లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... వాటిని అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదింటి ఆడపడుచులకు తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:తుపానుగా బలపడనున్న వాయుగుండం.. వర్ష సూచన