దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి... అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఆయన పర్యటించారు.
' తెరాస బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి' - ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చెక్కుల పంపిణీ
వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అందించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ... మహిళా సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేశారు.
వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ యంత్ర పరికరాలను అందించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని... పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయం అందజేసి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి:కలెక్టర్ ఆకస్మిక పర్యటన... ఎల్ఆర్ఎస్ సర్వేపై ఆరా