రైతుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి, పెద్దముప్పారం గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రెడ్యానాయక్ - dornakal mla redya nayak laid foundation to farmer's platform
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి, పెద్దముప్పారం గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రెడ్యానాయక్
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ ఉమతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఆ తహసీల్దార్ చెప్పడమే కాదు.. చేసి చూపించాడు