రైతే రాజు అన్నరీతిలో తెరాస పాలన కొనసాగుతోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. రైతు సంక్షేమం కోసం 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతోందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో కొత్తగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోంది: ఎమ్మెల్యే రెడ్యానాయక్ - MLA Reddyanaik inaugurated the power substation
దేశంలోని ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని డోర్నకల్ శాసన సభ్యుడు రెడ్యానాయక్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్
రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు అదనంగా ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ సభ్యురాలు సంగీతతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.