మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్... స్వయం సహాయక సంఘాలకు రూ.4 కోట్ల 18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - mahabubababad latest news
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు కేటాయించిందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో రూ.4 కోట్ల 18 లక్షల చెక్కులను స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశారు.
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ప్రతి నెల తప్పకుండా చెల్లించాలని మహిళలను కోరారు. అనంతరం పల్లె ప్రగతిలో భాగంగా 27 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను అందించారు.
ఇవీచూడండి:రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు నష్టపోతున్నారు: కేంద్ర మంత్రి