మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వి.పి.గౌతమ్ పర్యటించారు. పలు వీధుల్లో తిరుగుతూ లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాసేపు నిలబడి.. రహదారులపైకి వస్తున్న వాహనదారులను ఆపారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దంటూ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: వి.పి.గౌతమ్ - latest news on dont-get-unnecessarily-on-the-roads-vp-gautam
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో కలెక్టర్ వి.పి.గౌతమ్ పర్యటించారు.
![అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: వి.పి.గౌతమ్ dont-get-unnecessarily-on-the-roads-vp-gautam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6700821-579-6700821-1586266741466.jpg)
అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: వి.పి.గౌతమ్
అనంతరం పట్టణంలోని పలు బ్యాంకులకు వెళ్లి.. రద్దీని పరిశీలించారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆయా బ్యాంకు మేనేజర్లకు సూచించారు.
ఇదీ చూడండి :'ఎంపీ ల్యాడ్స్ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'