మహబూబాబాద్ జిల్లాలోని చిట్ఫండ్ నిర్వాహకులు ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలను నెలవారీ చిట్టీ వసూళ్ల పేరుతో వేధించవద్దన్నారు.
చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు - mahabubabad
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలోని చిట్ఫండ్ నిర్వాహకులు ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను నెలవారీ చిట్టీ వసూళ్ల పేరుతో వేధించొద్దన్నారు.
చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు
బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం విషయంలో మారటోరియం వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి :యజమానికి ప్రాణమిచ్చి... తానూ మరణించింది..