మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 110 మంది జర్నలిస్టులకు గోకుల్ యువసేన, సమైక్య జూనియర్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శానిటైజర్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్ గుగులోత్ బాలునాయక్ బియ్యం, కూరగాయలను అందించారు.
జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 110 మంది జర్నలిస్టులకు గోకుల్ యువసేన, సమైక్య జూనియర్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శానిటైజర్లు, నిత్యావసరాలు అందజేశారు.
110 మంది జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ
కరోనా వ్యాప్తి సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని జిల్లా గోకుల్ యువసేన అధ్యక్షుడు అడ్డగోడ నరేష్ అన్నారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి, నివారణ విషయాలను ఎప్పటికప్పుడూ ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు. ఈ కష్టకాలంలో జర్నలిస్టులకు అండగా తామూ సాయం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :లాక్డౌన్ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు