తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి' - దీక్షిత్​రెడ్డి కుటుంబ సభ్యుల మీడియా సమావేశం

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్​రెడ్డి... అపహరణ, హత్య కేసులో నిందితుడు సాగర్​ను వెంటనే శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. నిందితుడిని మరోసారి విచారించి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'
'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'

By

Published : Oct 28, 2020, 12:58 PM IST

Updated : Oct 28, 2020, 2:44 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దీక్షిత్​ రెడ్డి హత్య కేసులో నిందితుడు మందా సాగర్​ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. నిందితుడిని త్వరగా విచారించి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దీక్షిత్ రెడ్డి ఉదంతాన్ని చూసి హైదరాబాద్​లో మరో సంఘటన జరిగిందని... తమకు కలిగిన కడుపుకోత... మరెవ్వరికీ కలగకుండా నిందితుడికి త్వరితగతిన కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులపై తమకు నమ్మకం ఉందని దీక్షిత్​రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు.

'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'

ఇదీ చూడండి:గొర్రెకుంట మృత్యుబావి కేసుపై కాసేపట్లో తీర్పు

Last Updated : Oct 28, 2020, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details