తన కలంతో ప్రజలను చైతన్యపరిచి.. నిజాం నవాబుల నిరంకుశత్వాన్ని ఎదురించి... నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గొంతెత్తి చాటిన మహనీయుడు దాశరథి క్రిష్ణమచార్యులు అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కొనియాడారు. చిన్నగూడురు మండల కేంద్రంలో దాశరథి కృష్ణమాచార్యుల 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
చిన్నగూడురులో ఘనంగా దాశరథి జయంతి వేడుకలు - chinna guduru news
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో దాశరథి కృష్ణమాచార్యుల 95 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ వీపీ గౌతమ్... దాశరథి రచనలను కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దాశరథి స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.
dhasharathi krishnamachryula birthday celebrations in chinnaguduru
దాశరథి స్వగ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి రచనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దాశరథి స్మృతి వ ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.