మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేళతాళాలతో అమ్మవారి విగ్రహాలకు అట్టహాసంగా ఉత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికలపై ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మహబూబాబాద్‌లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు - మహబూబాబాద్ జిల్లా తాజా సమాచారం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మేళాతాళాలతో దుర్గాదేవి విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారు బాలత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు
మహబూబాబాద్‌లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తామని ఆలయ ప్రధాన పూజారి నరసింహ మూర్తి తెలిపారు. తొలి రోజు భక్తులకు అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల ప్రకారం ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. నవరాత్రి పర్వదినాలలో అమ్మవారిని ఆరాధించడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.