మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జగ్గుతండాకు చెందిన అజ్మీర హరిలాల్ 2019 ఏప్రిల్‌లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి గా ఎంపికై మరిపెడ మండలం పర్కల్జాల్తండాలో పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. అంతకు ముందు 2015లో గ్రూప్-2కు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసి 2017లో ర్యాంకు సాధించారు. 2019 ఆగస్టులో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నాడు.
2019 డిసెంబర్లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియామక పత్రం పొందారు. డీటీ కొలువు వచ్చింది కదా అని పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి కొద్దిరోజులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తారింగ్లో శిక్షణ పొందారు. కరోనా వైరస్ నేపథ్యంలో శిక్షణ నుంచి వీరిని ఇంటికి పంపించారు. అనంతరం ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు కూలీ పని చేస్తున్నాడు అజ్మీర హరిలాల్.