మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాప్ చేసి హత్య చేసిన హంతకుడు మందా సాగర్ మనస్తత్వం విచిత్రంగా ఉంటుందని అతని ఇంటి పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ స్వగ్రామం మహబూబాబాద్ మండలం శనగ పురం గ్రామం కాగా.. హంతకుడు మందా సాగర్ కూడా అదే గ్రామంలో నివసిస్తున్నాడు. గ్రామంలో రంజిత్ ఇంటి సమీపంలోనే సాగర్ నివాసం ఉంటుంది. సాగర్ 7వ తరగతి వరకు చదివి 10వ తరగతి ప్రైవేటుగా పాసయ్యాడు. పోలీస్ వాహనానికి ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో సాగర్ ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల పోలీసులు అతనిని డ్రైవర్‌గా తొలగించారు. దీంతో కొంత కాలం పాటు మహబూబాబాద్‌లోని ఓ మెకానిక్ షాప్‌లో పని చేశాడు. ఇటీవలే ఓ చిన్న ఆటోమొబైల్ షాప్‌ను పెట్టుకుని... మెకానిక్ పని చేస్తూ శనిగపురం నుంచి మహబూబాబాద్‌కు రోజూ వచ్చి... పోతూ జల్సాగా కాలం గడుపుతున్నాడు.
'దీక్షిత్‌రెడ్డి హంతకుడి మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది' - దీక్షిత్ రెడ్డి హత్య
డబ్బుల కోసం దురాశతో బాలుడిని కిడ్నాప్ చేసి... అనంతరం హత్య చేసిన హంతకుడు మందా సాగర్ మనస్తత్వం విచిత్రంగా ఉంటుందని అతని ఇంటి పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. తల్లిదండ్రులతో పాటు పలువురితో తరచూ గొడవలు పడుతుండేవాడని స్థానికులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సాగర్ ఇంటి ముందు వృధాగా ఉన్న మంచి నీటి ట్యాంక్‌ను ... 24 గంటలపాటు సెంట్రీ డ్యూటీ చేసే గదిని పోలిన విధంగా మార్పులు చేసుకున్నాడు. ఇంట్లో ఉండకుండా ఆ గదిలోనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా ఉంటూ తన కార్యకలాపాలను కొనసాగించాడు. ఇటీవలే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. నిశ్చయమైన వెంటనే ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వివాహాన్ని అమ్మాయి తరఫువారు రద్దు చేసుకున్నారు. అంతేకాక సాగర్ తల్లిదండ్రులు, తాత, నానమ్మ కులస్థులతో కూడా తరచూ ఘర్షణ పడేవారని స్థానికులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: దీక్షిత్‌రెడ్డి హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్