దీక్షిత్ హత్యకు గురయ్యాడన్న వార్తతో కుటుంబసభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. ఇంటి దీపం ఆరిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బిడ్డ కోసం ఎన్నో కలలు గన్న అని దీక్షిత్ తల్లి వసంత చెబుతోంది. ఇక తిరిగిరాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అంటోంది. తన కుమారుడిని హత్యచేసిన కిరాతకుడిని వదిలిపెట్టవద్దని కోరింది.
'వాళ్లనైనా చంపండి.. లేదంటే మేమైనా చస్తాం' - deekshit Reddy Murder Case Latest News
మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో హత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కిడ్నాప్‌కు గురైన బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులు.... ఇక తిరిగిరాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
'వాళ్లనైనా చంపండి.. లేదంటే మేమైనా చస్తాం'
తన మనవడి హత్య వెనుక మంద సాగర్, మనోజ్, సంఘర్ష్, అనిల్ అనే నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. డబ్బు కోసమే హత్య చేశారని అన్నారు. వాళ్లనైనా... చంపండి.. లేదంటే మేమైనా చస్తామంటూ... దీక్షిత్ తాతా వాపోయారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనాలు...
Last Updated : Oct 23, 2020, 1:06 PM IST