తెలంగాణ

telangana

ETV Bharat / state

బిల్లులు రావట్లేదని వార్డు సభ్యుడు వినూత్న నిరసన - తెలంగాణ టాప్ న్యూస్

Danthalapally Ward Member Locked Sarpanch : దంతాలపల్లిలో ఓ వార్డు సభ్యుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. బిల్లులు రావట్లేదని ఏకంగా పాలకవర్గాన్నే బందించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Danthalapally Ward Member Protest, ward member locked sarpanch
వార్డు సభ్యుడు వినూత్న నిరసన.. పాలకవర్గాన్ని బంధించి..!

By

Published : Feb 9, 2022, 4:38 PM IST

Danthalapally Ward Member Locked Sarpanch : మహబూబాబాద్‌ దంతాలపల్లిలో వార్డు సభ్యుడు కిషన్ వినూత్నరీతిలో నిరసన తెలిపాడు. పాలకవర్గాన్ని గ్రామపంచాయతీలో బందించాడు. సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులందరూ పంచాయతీలో ఉండగా... బయటినుంచి తాళం వేశాడు.

గ్రామంలో చేపట్టిన పనికి బిల్లులు రావట్లేదనే ఆగ్రహంతోనే పాలవర్గాన్ని బందించినట్లు వార్డు సభ్యుడు కిషన్ చెప్పాడు. చివరకు ఎంపీడీవో హామీ ఇవ్వడంతో తాళం తీశాడు.

బిల్లులు రావట్లేదని వార్డు సభ్యుడు వినూత్న నిరసన..

ఇదీ చదవండి:ప్రధాని వ్యాఖ్యలపై తెరాస నిరసనల హోరు.. భగ్గుమన్న గులాబీదళం

ABOUT THE AUTHOR

...view details