మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి, దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామాల్లో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీనివల్ల ములకలపల్లిలోని ఓ తాటిచెట్టుపై పిగుడు పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవటం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మహబూబాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం - Dangerous Winds surfing humans
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలులకు తోడు అకాల వర్షం తోడవటం వల్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
మహబూబాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం
పెద్దముప్పారంలో భారీ ఈదురు గాలులతో 100 కేవీ విద్యుత్తు ట్రాన్స్పార్మర్ కాలిపోయింది. మరో 10 విద్యుత్తు స్తంభాలు కూలిపోయినట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రూ.1 లక్ష నష్టం వాటిల్లినట్లు ఏఈ విద్యాసాగర్ తెలిపారు.