ప్రతి విద్యార్థి చదువుతోపాటు మంచి ప్రవర్తన కలిగి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని వందేమాతరం ఫౌండేషన్‌లో కాకినాడ రికార్డింగ్ సర్వీస్ కీడ్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలిసి ప్రారంభించారు.
కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్ - సైబరాబాద్ సీపీ సజ్జనార్ వార్తలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని వందేమాతరం ఫౌండేషన్‌లో కాకినాడ రికార్డింగ్ సర్వీస్ కీడ్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పాల్గొన్నారు.

కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
తెలంగాణ పోలీస్ తరఫున వందేమాతరం ఫౌండేషన్ వారికి సహాయ సహకారాలు ఉంటాయని సజ్జనార్ తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా మొబైల్స్‌కి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి రవీంద్ర, కిడ్స్ సంస్థ వైస్ ఛైర్మన్ పి.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం