తెలంగాణ

telangana

ETV Bharat / state

బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన - నిరసన

మహబూబాబాద్​-సూర్యాపేట జిల్లాలను కలిపే దంతాలపల్లి ప్రధాన రహదారి బురదమయంగా మారిందని కాంగ్రెస్​ కార్యకర్తలు, స్థానికులు నిరసన చేపట్టారు. బురద రోడ్లపై వరినాట్లు వేసి ఆందోళన నిర్వహించారు.

బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన

By

Published : Aug 23, 2019, 7:29 PM IST

బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
బురదమయంగా మారిన రోడ్డును పునరుద్ధరించాలని మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో కాంగ్రెస్​ కార్యకర్తలు, స్థానికులు డిమాండ్ చేశారు. వరినాట్లు వేసి నిరసన తెలిపారు. మహబూబాబాద్​-సూర్యాపేట జిల్లాలను కలిపే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందన్నారు. వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details