తెలంగాణ

telangana

ETV Bharat / state

జనావాసాల్లోకి మొసలి... భయాందోళనలో ప్రజలు

మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం చిన్నఎల్లాపురం శివారు హాము తండాలో మొసలి హల్​చల్​ చేసింది. జనావాసాల్లోకి మొసలి రావటం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచగా... ఘటనా స్థలికి చేరుకుని బంధించి వాగులో వదిలేశారు.

crocodile entered in to houses in hamu tanda
crocodile entered in to houses in hamu tanda

By

Published : Jan 1, 2021, 8:35 PM IST

జనావాసాల్లోకి మొసలి... భయాందోళనలో ప్రజలు

జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం చిన్నఎల్లాపురం శివారు హాము తండాలోకి మొసలి ప్రవేశించింది. మొసలిని చూసిన తండా వాసులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు... మొసలిని బంధించారు. అనంతరం పాకాల సరస్సులో వదిలిపెట్టారు.

గూడూరు సమీపంలోనీ పాకాల వాగులో మొసళ్లు తిరుగుతున్నాయని... అప్పుడప్పుడు కనపడుతున్నాయని స్థానికులు తెలిపారు. పాకాల వాగులో మొసళ్లు సంచరిస్తున్నాయని... రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని గుడూరు రేంజ్ అటవీశాఖ అధికారిణి అమృత వెల్లడించారు. రైతులు
వాగులోకి దిగవద్దని... అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. మొసలి కనిపిస్తే అధికారులకు వెంటనే సమాచారం అందించాలని అమృత సూచించారు.

ఇదీ చూడండి: 2020లో మద్యం అమ్మకాల ఆల్​టైమ్ రికార్డు

ABOUT THE AUTHOR

...view details