తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం ర్యాలీ - ఆర్టీసీ కార్మికుల ఐదో రోజు సమ్మె

మహబూబాబాద్​లో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టారు. కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

CPM rally to support TSRTC workers' strike

By

Published : Oct 9, 2019, 8:06 PM IST

ఆర్టీసీ కార్మికుల ఐదో రోజు సమ్మెకు మద్దతుగా మహబూబాబాద్​లో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. చేరుకుంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపన్నుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్​ ఆరోపించారు. సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కేసీఆర్, నేడు కార్మికుల సమ్మెను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వంలో విలీనం చేయాలని లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details