మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు సీపీఐ శ్రేణులు ఆందోళన చేశారు. కరోనా లాక్‌డౌన్‌తో పేద, మధ్య తరగతి ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి: సీపీఐ - Cpi Strike for on Electricity Bills
పేద ప్రజలపై అధిక భారం మోపుతూ పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీపీఐ శ్రేణులు మహబూబాబాద్‌లో డిమాండ్ చేశారు. లేకపోతే విద్యుత్ ఆఫీసుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి
వారి ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరారు. లేకపోతే విద్యుత్ ఆఫీసుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బి. అజయ్ సారధి, పెరుగు కుమార్, నవీన్, చింతకుంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Jun 16, 2020, 6:53 AM IST