ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేదవాడి నడ్డి విరుస్తోందని సీపీఐ నాయకుడు అజయ్ సారథి మండిపడ్డారు. భవిష్యత్తులో కట్టెల పొయ్యిపై వంట చేసుకునే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ శ్రేణులు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వినూత్న నిరసన తెలిపాయి.
'మోదీ ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తోంది' - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ శ్రేణులు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వినూత్న నిరసన తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కట్టెల పొయ్యే దిక్కని.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

'మోదీ ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తోంది'
'మోదీ డౌన్ డౌన్, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి' అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ దేశాలు ధరల స్థిరీకరణకు కృషి చేస్తోంటే.. మన దేశంలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఆ దాడి వెనుక ప్రభుత్వ హస్తం ఉంది: నారాయణ