ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంటికో ఉద్యోగమని చెప్పి కనీసం ఊరికొకటి కూడా ఇవ్వలేదు: సీపీఐ - సీపీఐ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ
అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడే వారినే మండలికి పంపాలని.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి అయిన జయసారధిని గెలిపించాలని కోరారు.
ఇంటికో ఉద్యోగమని చెప్పి కనీసం ఊరికొకటి కూడా ఇవ్వలేదు: సీపీఐ
అనేక వాగ్ధానాలను చేసి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదని, ఇంటికో ఉద్యోగమని చెప్పి కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వామపక్షాల అభ్యర్థి, జర్నలిస్ట్, ఉత్సాహవంతుడు అయిన జయసారధి రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి, ఏఐటీయూసీ నాయకుడులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.