తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ గుంతను పూడ్చాలని ధర్నా - mission bhagiratha

వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్విన పెద్ద గుంతను వెంటనే పూడ్చాలంటూ సీపీఐ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.

మిషన్ భగీరథ గుంతను పూడ్చాలని ధర్నా

By

Published : Aug 14, 2019, 1:28 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోడు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్విన గుంతను పూడ్చాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గుంత ఉండటం వలన విద్యార్థులు అందులో పడే అవకాశం ఉందని సీపీఐ నాయకుడు అజయ్ సారధి పేర్కొన్నారు. ట్యాంక్ నిర్మాణం కోసం గుంతను తవ్వి, పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, లేదంటే గుంతను పూడ్చాలని డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథ గుంతను పూడ్చాలని ధర్నా

ABOUT THE AUTHOR

...view details