మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణాల ముందు సీపీఐ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని ఇవ్వాలని, 9 రకాల నిత్యావసర సరుకులను అందజేయాలని కోరారు.
'మరో ఆరు నెలలూ 1500 రూపాయలు ఇవ్వాలి' - మహబూబాబాద్లో రేషన్ దుకాణాల ముందు సీపీఐ నాయకులు నిరసన
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణాల ముందు సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
'మరో ఆరు నెలలూ 1500 రూపాయలు ఇవ్వాలి'
5 డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులను చేత పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం డీలర్లకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. కరోనా విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల ఎంతో మంది నిరుపేద ప్రజలు తిండికి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా నాయకుడు అజయ్ సారధి తెలిపారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకే తాము ఆందోళన చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి:మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం