మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికులపై లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకుని కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నిరసన
హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మహబూబాబాద్‌లో సీపీఐ నిరసన