పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా గోపాల మిత్ర ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా బలరాంతండా గ్రామంలో ఈ నెల 14న పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామంలో ఉన్న పశువులకు టీకాలు వేశారు. గ్రామానికి చెందిన బానోత్ సునీతకు చెందిన జెర్సీ ఆవు 18న మృతి చెందింది.
ఆవుకు టీకా వేసినప్పటి నుంచి మేత తినలేదని, నీరు కూడా తాగలేదని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆవు మృతి చెందిందని ఆవు యజమానురాలు సునీత ఆవేదన వ్యక్తం చేసింది. ఆవు మృతికి కారణమైన పశు వైద్యులపై చర్యలు తీసుకుని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని సునీత వేడుకుంది.