మహబూబాబాాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36వ వార్డులో పేదలను వార్డు కౌన్సిలర్ నీరజ ధర్మన్న ఆదుకున్నారు. మంగళవారం ప్రతి ఇంటికి తిరుగుతూ... సుమారు మూడు వందల కుటుంబాలకు ఆరు రకాల కూరగాయలను అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు చేతనైన చిరు సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
కూరగాయలు పంపిణీ చేసిన కౌన్సిలర్ నీరజ ధర్మన్న - మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ నీరజ ధర్మన్న
లాక్డౌన్ కాలంలో ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డులోని పేదలకు కౌన్సిలర్ నీరజ ధర్మన్న చేయూత అందించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ... ఆరు రకాల కూరగాయలతో కూడిన బ్యాగ్‌ను ప్రజలకు అందజేశారు.
![కూరగాయలు పంపిణీ చేసిన కౌన్సిలర్ నీరజ ధర్మన్న councilor-neeraja-dharmanna-distributed-vegetables-at-36th-word-mahabubabad-municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6795781-thumbnail-3x2-cpi.jpg)
కూరగాయలు పంపిణీ చేసిన కౌన్సిలర్ నీరజ ధర్మన్న
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. లాక్‌డౌన్‌కు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి, మాజీ కౌన్సిలర్ రామ్మూర్తి, ఉప్పల రంగా, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
TAGGED:
av