మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఏడవ వార్డు కౌన్సిలర్ మాడుగుల నట్వర్ కరోనాతో మృతి చెందారు. తెరాస పార్టీ సీనియర్ నాయకులు నట్వర్ మృతిచెందడంతో తొర్రూరు పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
కరోనాతో కౌన్సిలర్ మాడుగుల నట్వర్ మృతి... - తెలంగాణ వార్తలు
కరోనాతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఏడవ వార్డు కౌన్సిలర్ మాడుగుల నట్వర్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
dead
మాడుగుల నట్వర్ గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. నట్వర్ మృతిపట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు.
ఇదీ చుడండి: Isolation : అడవే ఐసోలేషన్ కేంద్రం.. చెట్ల కిందే ఆవాసం