తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారి నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల అతడిని హైద్రాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Corona symptoms one person in the Mahabubabad district
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు

By

Published : Apr 4, 2020, 11:17 AM IST

మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంకు చెందిన ఓవ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల అతడిని హైద్రాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్చి 17న తెలంగాణ ఎక్స్​ప్రెస్​లో దిల్లీ నుంచి కాజీపేటకు మర్కజ్​ వెళ్లి వచ్చాడు. అతడు మార్చి 18 నుంచి 30 వరకు జిల్లాలోని 6 మండలాల్లో సంచరించాడని అధికారులు నిర్ధరించారు. అతనితో సన్నిహితంగా ఉన్న సుమారు 30 మందిని గుర్తించారు.

వారిలో ఐదుగురిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు, 25 మందిని ప్రభుత్వ క్వారంటైన్ గృహానికి తరలించారు. ఐదుగురి రక్త నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఇంకా ఎవరెవరిని కలిశారు, అనే వివరాలను సేకరిస్తున్నారు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావొద్దని, చేతులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని చెబుతున్నారు. అతడు తిరిగిన పలు గ్రామాల్లో కొన్ని కుటుంబాల వారిని ఇళ్లలోనే హోమ్ క్వారంటైన్​గా ఉండాలని అధికారులు సూచించారు.

మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు

ఇదీ చూడండి :కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details