తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ బారిన పడిన మహబూబాబాద్​ ఎమ్మెల్యే.. - ఎమ్మెల్యే బానోత్​ శంకర్ ​నాయక్​కు కరోనా

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మహమ్మారి బారిన పడ్డారు. తాను ఈరోజు చేయించుకున్న కొవిడ్​ టెస్టులో పాజిటివ్​ వచ్చిందని మహబూబాబాద్​ శాసనసభ్యుడు బానోత్​ శంకర్​నాయక్ తెలిపారు.

corona positive to the mahabubabad mla banoth shankar naik
కొవిడ్​ బారిన పడిన మహబూబాబాద్​ ఎమ్మెల్యే..

By

Published : Nov 8, 2020, 2:38 PM IST

మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆయన బయల్దేరి వెళ్లారు. కాగా ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే స్వయంగా ఓప్రకటన ద్వారా ప్రజలకు చెప్పారు. తనను గత రెండు రోజుల్లో కలిసిన వారు అందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ప్రజలకు పార్టీ శ్రేణులకు ఏ అవసరం వచ్చినా.. ఏసమయంలోనైనా తనను ఫోన్​ ద్వారా సంప్రదించాలని తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో రెండున్నర లక్షలకు చేరిన కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details